తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా వైవిధ్యమైన వినాయక నిమజ్జనాలు, పూజలు
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలో కొబ్బరి బోండాలతో, సత్తెనపల్లిలో బెల్లంతో, విశాఖలో కోటి గాజులతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాకినాడలో జీడిపప్పు, డ్రై కివీ పండ్లతోనూ, అనకాపల్లిలో మొక్కలతో గణనాథులను తీర్చిదిద్దారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ భక్తులు వినూత్న రీతిలో విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.