వైకాపా మద్యం కుంభకోణం కేసు: ఈడీ విచారణకు విజయానందరెడ్డి గైర్హాజరు

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మెట్టపల్లి చిన్నపరెడ్డి విజయానందరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని కార్యాలయంలో గురువారం ఉదయం విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన వెళ్లలేదని పేర్కొన్నారు. మరోసారి విచారణకు వస్తానని ఆయన సమాచారమిచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టుల పేరుతో భారీగా అనుచిత లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది.