తుపాన్ ధాటికి కుప్పకూలిన ఇల్లు రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం రాత్రి వంట్లమామిడి పంచాయతీ పరిధిలోని నందిగరువు గ్రామానికి చెందిన కాకర నాగేశ్వరరావు నివాసం పూర్తిగా కూలిపోయింది. తుపాన్ ధాటికి ఇల్లు ధ్వంసం కావడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అధికారులు తక్షణమే స్పందించి బాధితుడిని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.