వైద్యుల అద్భుత ప్రతిభ: తెగిపోయిన యువకుడి కుడి ముంజేయిని విజయవంతంగా అమర్చిన వైనం
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
డ్రిల్ మెషిన్ ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన పందొమ్మిదేళ్ల యువకుడి కుడి ముంజేయిని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా తిరిగి అమర్చినట్లు ప్లాస్టిక్ సర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దివ్య సాయి నర్సింగం తెలిపారు. ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకురావడంతో, వైద్యులు పది గంటల పాటు శ్రమించి ఈ క్లిష్టమైన రీకన్స్ట్రక్టివ్ శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అమర్చిన చేతిలో రక్తప్రసరణ సాధారణ స్థితికి చేరిందని పేర్కొన్నారు.