ఇందిరాపార్క్ మహాధర్నా గోడపత్రికలను ఆవిష్కరించిన సిఐటియు మండల కన్వీనర్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జన్నారం మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం జన్నారంలో ధర్నాకు సంబంధించిన గోడపత్రికలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.