పెరిగిన మేత ధరలతో తీవ్ర సంక్షోభంలో ఆక్వారంగం
రిపోర్టర్: సతీష్
స్థలం: Andhra Pradesh
ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పాదక ఖర్చులు, మేత ధరల అంతులేని పెరుగుదల కారణంగా ఆక్వారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ తయారీదారులు ఏకపక్షంగా ధరలు పెంచడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులు, వైరస్ వ్యాప్తి, అంతర్జాతీయ ఎగుమతుల్లో ఆంక్షలతో నష్టాలను చవిచూస్తున్నామని, ప్రభుత్వం స్పందించి రొయ్యల మేతను సబ్సిడీ ధరకు అందించాలని రైతులు కోరుతున్నారు.