రామాయణ చిత్రంలో శూర్పణఖ లుక్ విడుదల: రాజసంగా రకుల్ ప్రీత్ సింగ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ చిత్రంలో శూర్పణఖ పాత్ర పోషిస్తున్న నటి రకుల్ ప్రీత్‌సింగ్ కొత్త పోస్టర్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో బంగారు ఆభరణాలు ధరించి, రాజసం ఉట్టిపడే వస్త్రాధారణతో రథంపై వస్తున్న రావణ సోదరి శూర్పణఖగా రకుల్ లుక్ చాలా అందంగా ఉందని, నవంబర్ ఐదున ఈ భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందని వారు తెలిపారు.