జహీరాబాద్లో హ్యుందాయ్ ఆర్అండ్డీ సెంటర్: సంగారెడ్డి జిల్లాకు భారీ ఊరట

రిపోర్టర్: రాము స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో హ్యుందాయ్ ఆర్అండ్డీ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 8,528 కోట్ల వ్యయంతో రానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు వేలకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం వెల్లడించారు. తక్షణ అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.