అమెరికాలో దారుణం నిద్రలో ఉన్న వైద్యుడి హత్య
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Pittsburgh
అమెరికాలోని పిట్స్బర్గ్లో జరిగిన దారుణ ఘటనలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఇడ్రిస్ ఎవాన్స్ ప్రాణాలు కోల్పోయారని అలెగేని కౌంటీ పోలీసు అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఎడ్జ్వుడ్ అవెన్యూలోని ఆయన నివాసంలోకి చొరబడిన ముగ్గురు నిందితుల్లో ఒకడైన ఎలిజా హెమింగ్వే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్యుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందని పోలీసులు స్పష్టం చేశారు.