సేవకు ఇరవై ఐదేళ్లు: శేరిలింగంపల్లిలో ఘనంగా సేవా జ్యోతి ర్యాలీ
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సేవా జ్యోతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. క్రిస్టల్ గార్డెన్స్ నుంచి చందానగర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఇంచార్జి రవికుమార్, కాసిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొని వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.