రైతు రిజిస్ట్రీలో నమోదు కాకపోతే పీఎం కిసాన్ నిధులు కట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రిజిస్ట్రీలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80 శాతం మంది రైతుల పేర్లే నమోదయ్యాయని, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ నమోదు మరింత అట్టడుగున ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. పీఎం కిసాన్ కింద ఆర్థిక సాయం పొందుతున్న వారిలో ఇంకా 7.34 లక్షల మంది రైతు రిజిస్ట్రీలో నమోదు కాలేదని, వీరంతా వెంటనే నమోదు చేసుకోకుంటే త్వరలో విడుదల కానున్న 24వ విడత నిధులతో పాటు ఇతర లబ్ధి కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ స్పష్టం చేశారు.