ఓటర్ల జాబితా పరిశీలన: ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కు పరిరక్షణ
రిపోర్టర్: గోపి
స్థలం: ఖమ్మం
ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. శ్రీ దేవసేన తెలిపారు. కూసుమంచి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. శ్రీ దేవసేన మరియు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించే దిశగా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.