కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: Jagtial
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారైన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు SP JAGTIAL వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుల నుంచి చోరీకి గురైన బంగారు పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన ఒక బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారుల ద్వారా స్పష్టం చేశారు.