పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: వికారాబాద్
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా హకీంపేట సభలో తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ హయాంలో సుమారు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన పాలనలోనే కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై గత ప్రభుత్వ పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు.