బెంగళూరులో దారుణం: భార్యను హత్య చేసి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

రిపోర్టర్: వెంకట్ స్థలం: కర్ణాటక

బెంగళూరులోని విభూతిపురలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం అక్రమ సంబంధం అనుమానంతో భార్య శృతిని బీరు బాటిల్‌తో కొట్టి చంపిన ఆటో డ్రైవర్ రాఘవేంద్ర, ఆ తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.