ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రూ.29 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.