మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనపై డీజీపీని ఆదేశించిన హైకోర్టు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
శాసనసభ సమావేశాల తొలి రోజున మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను హైకోర్టు ఆదేశించినట్లు ఆ పార్టీ లీగల్ టీమ్ వెల్లడించింది. అసెంబ్లీ గేటు వద్ద నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం బాధ్యులైన అధికారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.