ఫ్రాన్స్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నిరసనలు: విచ్ఛిన్నకర శక్తుల అల్లర్లు, భారీ లూటీ

రిపోర్టర్: శివ స్థలం: ఫ్రాన్స్

ఫ్రాన్స్లో పెరుగుతున్న జీవన వ్యయంపై చెలరేగిన హింసాత్మక నిరసనలు తీవ్ర రూపం దాల్చాయని, పారిస్ సహా పలు నగరాల్లో దుండగులు దుకాణాలు ధ్వసం చేసి భారీ దోపిడీకి పాల్పడ్డారని ఫ్రెంచ్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారులు వెల్లడించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్బై మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారని, ప్రజల భద్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేస్తూ హింసను తీవ్రంగా ఖండించారు.