గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో భద్రత మధ్య నిర్వహించుకోవాలి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటు కట్టుదిట్టమైన భద్రత, మధ్య నిర్వహించుకోవాలని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల భద్రతనే తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసు యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని కోరారు.