తెలుగు ప్రేక్షకులు విజయ్ సినిమాలను ఎంతో ఆదరిస్తారన్న నాగార్జున

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిగ్మా సినిమాపై ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని ప్రశంసలు కురిపించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ పది కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు విజయ్ సినిమాలను ఎప్పుడూ భారీగా ఆదరిస్తారని తెలిపారు. అదే ప్రేమ జాసన్ సంజయ్ మొదటి సినిమాకు కూడా దక్కాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు జాసన్ సంజయ్ తో పాటు హీరో సందీప్ కిషన్ కూడా పాల్గొన్నారు.