స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా స్పష్టత
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికలకు పాత విధానమే అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. అమరావతిలో ఇరువై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి సహకారాన్ని అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.