దీపావళి వేడుకల్ లో అప్రమత్తత అవసరం: ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన భద్రతా చర్యలు

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

దీపావళి పండుగ సందర్భంగా ఇళ్లలో దీపాలు, కొవ్వొత్తులు మరియు ఎలక్ట్రికల్ లైటింగ్ ఎక్కువగా వాడే సమయంలో అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. పండుగ వేళ ఎలక్ట్రికల్ వైర్లు, ప్లగ్ పాయింట్లు, స్విచ్ బోర్డులను ముందుగానే సరిగ్గా తనిఖీ చేసుకోవాలని సూచించారు. అలాగే ఇంట్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ మరియు స్మోక్ అలారాలు సరిగ్గా పనిచేసేలా చూసుకోవడం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.