హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్లు ఢీకొని ఆయిల్ ట్యాంకర్ అగ్నిప్రమాదానికి గురైంది. అయితే హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించాయి. మరోవైపు ఈ వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ క్షిపణి దాడి వల్లే ఎల్ గైయా నౌక దెబ్బతిన్నట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.