దక్షిణ మధ్య రైల్వేలో పలు రైళ్లు రద్దు, ప్రయాణికులకు అలర్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

కాజీపేట–బల్లార్ష మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల కారణంగా ఈ నెల 10న పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. జమ్మికుంట–పోత్కపల్లి స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.