ఢిల్లీలో కలకలం: తిరంగా యాత్రకు వెళ్తున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సీపీలో భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 అమల్లో ఉందని, అందుకే ఈ నిర్బంధం చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. తాను ఒక్కడినే ఉన్నానని, ఏ చట్టాన్ని ఉల్లంఘించానని దిప్కే ఈ సందర్భంగా పోలీసులను నిలదీశారు.