షాకింగ్ ఘటన: ఏఐతో మొసలి ఫొటో సృష్టించి ఉద్యోగికి పంపిన వ్యక్తి అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Singapore
కృత్రిమ మేధస్సు సాయంతో నకిలీ మొసలి చిత్రాన్ని సృష్టించి తోటి ఉద్యోగికి పంపిన యే లిన్ అనే వ్యక్తిపై సింగపూర్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పాండన్ రిజర్వాయర్లో మొసలి సంచరిస్తోందంటూ తప్పుడు సమాచారంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో భయాందోళనలు తలెత్తడంతో పాటు ప్రభుత్వ వనరులు వృథా అయ్యాయని, నిందితుడికి భారీ శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.