కీరదోసతో విద్యార్థులకు కండోమ్ క్లాస్ చెప్పిన బయాలజీ టీచర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పూర్నియా
బీహార్లోని పూర్నియాలో విద్యార్థులకు కండోమ్ క్లాస్ చెప్పిన బయాలజీ టీచర్ చందన్ కుమార్ పండిత్ తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. మానవ పునరుత్పత్తి వ్యవస్థ అంశంలో భాగంగా కీరదోసను ఉపయోగించి ఆయన ప్రయోగాత్మక అవగాహన కల్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పుస్తక చదువుతో పాటు సున్నితమైన అంశాలపై ఇలాంటి ప్రాక్టికల్ అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.