ఉద్యోగులకు తీపి కబురు: తెలంగాణలో తొమ్మిది వందల ఆసుపత్రులలో నగదు రహిత వైద్యం
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు నగదు రహిత వైద్య సేవలు మరింత విస్తరించినట్లు ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వందల పంతొమ్మిది ఆసుపత్రులలో ఈహెచ్ఎస్ కింద క్యాష్‌లెస్ వైద్యం అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఏడు వందల V ఎనిమిది ప్రైవేట్, నూట నలభై ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని పేర్కొంటూ అర్హులైన లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు.