దేశవ్యాప్తంగా శాసనసభలు ఏడాదిలో కనీసం ముప్పై రోజులు సమావేశం కావాలి: విజేందర్ గుప్తా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఢిల్లీ

దేశంలోని అన్ని శాసనసభలు సంవత్సరంలో కనీసం ముప్పై రోజులు సమావేశాలు నిర్వహించాలని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా స్పష్టం చేశారు. ఉమ్మడి రూల్బుక్పై ఏర్పాటైన కమిటీ సమావేశంలో ఈ కీలక ప్రతిపాదనపై చర్చించారు. అయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలపై మరింత చర్చిస్తామని కమిటీ చైర్మన్ సతీశ్ మహానా తెలిపారు. ఈ భేటీలో సభ్యుల సస్పెన్షన్ పరిమితి, డిజిటల్ నోటీసులు, సభా నిర్వహణ నియమాల మార్పులపై కూడా విస్తృతంగా చర్చలు జరిపారు.