మార్కాపురంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించిన కలెక్టర్ విజయసునీత

రిపోర్టర్: రాజేష్ స్థలం: ప్రకాశం

మార్కాపురంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను కలెక్టర్ ఎం.విజయసునీత ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులను భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని ఆమె కొనియాడారు. విద్యతోనే సమాజం చైతన్యవంతం అవుతుందని పేర్కొంటూ, విద్యా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన 56 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.