గోదావరి ప్రవాహంలో గల్లంతైన పదో తరగతి విద్యార్థి

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

కుక్కునూరు మండలం పెదరావిగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తుండగా పదో తరగతి విద్యార్థి బూరం పాల్రాజ్ గల్లంతయ్యాడు. గుంటూరులో చదువుతున్న బాలుడు సెలవులకు వచ్చి స్నేహితులతో కలిసి నదికి వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.