పూరీ జగన్నాథుడి నమూనాలో బాలాపూర్ గణేశుడు

రిపోర్టర్: గోపి స్థలం: రంగారెడ్డి

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా పూరీ జగన్నాథ ఆలయ నమూనా నిలిచింది. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా 18 అడుగుల ఎత్తులో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతంలో తిరుపతి, అయోడ్య రామమందిరం నమూనాల్లో గణపయ్యను ప్రతిష్టించిన నిర్వాహకులు, ఈసారి పూరీ క్షేత్రాన్ని తలపించేలా అద్భుతమైన మండపాన్ని తీర్చిదిద్దారు. దీంతో గణేష్ ఉత్సవాల సందడి మరింత పెరిగింది.