తీవ్ర తుఫాను ముప్పు: ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటుతున్న మురసు తుపాను
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
మురసు తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఒంగోలు సమీపంలో కొత్తపట్నం వద్ద తుపాను తీరాన్ని తాకిందని, గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో కదులుతోందని అధికారులు పేర్కొన్నారు. తుపాను కారణంగా విజయవాడలో విమానాలు, పలు రైళ్లు రద్దయ్యాయి. బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్ లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.