జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసి రైతుల తీవ్ర నిరసన

రిపోర్టర్: సురేష్ స్థలం: జూరాల ప్రాజెక్ట్

సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో ఆగ్రహించిన రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, ప్రాజెక్టు వద్దకు చేరుకుని తాళాలు బద్దలు కొట్టి ఎడమ కాలువ గేట్లను స్వయంగా ఎత్తివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహం పెల్లుబికింది.