యూఎస్ ఓపెన్ ఫైనల్ ఓటమిపై సబలెంకా తీవ్ర భావోద్వేగం
రిపోర్టర్: వెంకట్
స్థలం: New York
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో ఓటమిపాలైన తర్వాత స్టార్ ప్లేయర్ అరినా సబలెంకా తీవ్రంగా నిరాశ చెందారు. గ్ర్యాండ్ స్లామ్ ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలో పేరుకుపోయిన కోపాన్ని, నిరాశను కోర్టులోనే బయటపెట్టానని, లేకపోతే మానసికంగా కుంగిపోయేదానినని సబలెంకా స్పష్టం చేశారు.