అమరావతి ఉద్యమనేత రామారావు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారాయణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నేలపాడులో అమరావతి ఉద్యమ నేత, రైతు ధనేకుల రామారావు కుటుంబాన్ని మంత్రి పొంగూరు నారాయణ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరావతి కోసం తొలినాళ్లలోనే భూములు అందించి రైతు త్యాగాలకు ప్రతీకగా నిలిచారన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, ఉద్యమంలో ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గౌరవిస్తామని నారాయణ పేర్కొన్నారు.