శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం నలుగురు దుర్మరణం
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో రాజధాని ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి వారిని ఢీకొనడంతో ఈ ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు మరియు స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.