కాణిపాక బ్రహ్మోత్సవాలలో పాత్రికేయులను అడ్డుకున్న పోలీసుల తీరుపై విమర్శలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
కాణిపాక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం చిత్రీకరణకు వెళ్లిన స్థానిక పాత్రికేయులను పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలయాధికారుల ఆదేశాల మేరకే వచ్చామని చెప్పినా కానిస్టేబుల్ జగన్నాథం దురుసుగా మాట్లాడినట్లు పాత్రికేయులు ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.