నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా ఐఐటీ రూరూర్కీ స్నాతకోత్సవంలో అజిత్ దోవల్
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఐఐటీ రూరూర్కీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. సరిహద్దు దాటి వెళ్లిన ఆపరేటివ్స్ చైనా కస్టడీకి చిక్కినప్పుడు తన కెరీర్ ముగిసిపోయిందని భావించినట్లు ఆయన తెలిపారు. అయితే విచారణలో తప్పు తనది కాదని తేలిందని, హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన మ్యాప్స్‌లో లోపాల వల్లనే ఆ ఘటన జరిగిందని దోవల్ స్పష్టం చేశారు.