ఆసియా పారా గేమ్స్: పతకాల మోతతో నాలుగో స్థానానికి దూసుకెళ్లిన భారత్
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
ఆసియా పారా గేమ్స్ క్రీడా పోటీల్లో భారత ఆటగాళ్ళు అద్భుత ప్రదర్శన కనబరిచారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. గురువారం ఒక్కరోజే ఏడు బంగారు పతకాలతో సహా మొత్తం ఇరవై ఆరు పతకాలను భారత్ సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ తిరిగి నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు.