అమరావతిలో వేగంగా కొనసాగుతున్న రెండో విడత భూసమీకరణ ప్రక్రియ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
అమరావతి రాజధాని రెండో విడత భూసమీకరణ ప్రక్రియను ప్రభుత్వం మరియు సీఆర్డీఏ వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా పెదమద్దూరులో ఇప్పటివరకు దాదాపు 75 శాతం అనగా 764 ఎకరాలకు రైతుల నుంచి సమ్మతి పత్రాలను అధికారులు సేకరించారు. భూసమీకరణకు అంగీకరించిన రైతులకు నిబంధనల ప్రకారం వార్షిక కౌలు మొత్తాన్ని విడుదల చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు.