ఆసియా క్రీడల్లో సత్తా చాటుతున్న భారత అథ్లెట్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Aichi-Nagoya

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, మహిళల క్రికెట్, ట్రెడిషనల్ ఎంఎంఏ, సాఫ్ట్ టెన్నిస్ విభాగ పతకాలు సాధిస్తూ భారత్ పతకాల పట్టికలో దూసుకెళ్తోంది. మహిళల క్రికెట్ జట్టు ఒక స్వర్ణం సాధించగా, షూటింగ్‌లో ఎలవెల్ వలరివన్, హిమాన్షు ధిల్లాన్, రుద్రంక్ష్ పాటిల్ తదితరులు పతకాలు కొల్లగొట్టారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించగా, సుచిక తరియల్, జయ మీనా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతానికి భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలు చేరాయి.