పాపకొల్లులో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన సరఫరా

రిపోర్టర్: bhukya Narasimha rao స్థలం: జులూరుపాడు

పాపకొల్లు 33/11 కేవీ సబ్స్టేషన్లో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఎల్వీ వీసీబీని బుధవారం విజయవంతంగా చార్జ్ చేశామని సూపర్ఇంటెండింగ్ ఇంజనీర్ గొట్టిముక్కల మహేందర్ తెలిపారు. ఈ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి రావడంతో పాపకొల్లు పరిధిలో విద్యుత్ లోడ్ నిర్వహణ మరింత మెరుగుపడుతుందని, వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా అందించేందుకు దోహదపడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.