దుబాయ్‌లో హత్యకు గురైన ఉడిపి వ్యక్తి అకౌంట్ నుంచి డ్రా

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఉడిపి

యూఏఈలో హత్యకు గురైన ఆల్విన్ ప్రకాష్ కుందర్ మృతి తర్వాత కూడా అతని బ్యాంకు ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. జూలైలో ఆల్విన్ హత్యకు గురై కార్‌లో శవమై కనిపించగా, ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ కాపీ రాలేదని సోదరుడు అ ప్రశాంత్ కుందర్ వాపోయారు. శుక్రవారం ఉదయం మృతదేహం ఉడిపికి రానుండగా, విచారణ వేగవంతం చేయాలని ఎంపీ కోట శ్రీనివాస పూజారి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు.