అభివృద్ధి దిశగా రాజమండ్రి రూరల్: వ్యవసాయ కళాశాలలో పనులకు చర్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తూర్పు గోదావరి
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరిపాలన సాగుతోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. నియోజకవర్గంలోని వ్యవసాయ కళాశాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే పనులను వేగవంతం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.