కేరళలో త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కేరళ

కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ పంచెకట్టులో ఆలయానికి వెళ్లి శ్రీకృష్ణుడు, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.