సఫాయి మిత్రుల సంక్షేమం కోసం కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

సఫాయి మిత్రుల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా ఉచ విద్యా శాఖ కార్యదర్శి దీప్తి గౌర్ ముఖర్జీ సఫాయి కర్మచారిలు, సేవా మిత్రులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారందరికీ రక్షణ కిట్లను పంపిణీ చేశారు. శ్రామికుల శ్రమను గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.