సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ బంపర్ ఆఫర్
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తమకున్న ఆస్తులన్నీ రాసిస్తామని, రేవంత్ రెడ్డి చెబుతున్న రూ.లక్ష కోట్లను రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో జమ చేస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ ఆఫర్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.