పాఠశాలల్లో యోగా శిక్షణపై విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

అమరావతిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి నివారణకు రాష్ట్రవ్యాప్తంగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షల మంది విద్యార్థులకు హార్ట్ ఫుల్ యోగా శిక్షణ ఇప్పించాలని ఆయన ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.