ఖైరతాబాద్ బడా గణేశ్ వాహన సారథిగా నాల్గోసారి వెంకట్ రెడ్డి

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్రలో ఇరవై ఆరు టైర్ల భారీ వాహనాన్ని నాల్గోసారి నడుపుతున్నట్లు డ్రైవర్ మండాది వెంకట్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆయన, భక్తిభావంతోనే ఈ సేవనందిస్తున్నానని, ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోనని పేర్కొన్నారు. నగరంలో ముప్పై రెండు అడుగుల భారీ విగ్రహ నిమజ్జన ఊరేగింపులో విద్యుత్ తీగలు, భక్తుల రద్దడి మధ్య అత్యంత అప్రమత్తంగా వాహనాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు.